స్పైడర్ సీన్స్ లీక్పై క్లారిటీ..! | Spyder team asks not to believe rumours of the leaked footages | Sakshi
Sakshi News home page

స్పైడర్ సీన్స్ లీక్పై క్లారిటీ..!

Published Sun, Sep 3 2017 12:34 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

స్పైడర్ సీన్స్ లీక్పై క్లారిటీ..!

స్పైడర్ సీన్స్ లీక్పై క్లారిటీ..!

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు లీక్ అవ్వటం కామన్ అయిపోయింది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ లీక్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  ఈ విషయం పై స్పందించిన చిత్రయూనిట్ అలాంటిదేమి లేదంటూ కొట్టిపారేసింది. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేసిన స్పైడర్ టీం, కొంత మంది కావాలనే ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని తెలిపింది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా అలరించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement