మరో తెలుగు హీరోతో మురుగదాస్..? | Ram Charan to Work with AR Murugadoss | Sakshi
Sakshi News home page

మరో తెలుగు హీరోతో మురుగదాస్..?

Published Wed, Jul 5 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

మరో తెలుగు హీరోతో మురుగదాస్..?

మరో తెలుగు హీరోతో మురుగదాస్..?

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్, త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్న కోలీవుడ్ బడానిర్మాతలు. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. ఈ కాంబినేషన్పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్, మురుగదాస్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు ఓకె  చెప్తాడని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది. స్పైడర్ పూర్తయిన తరువాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్తో సినిమా చేయనున్నాడు మురుగదాస్. ఆ సినిమా పూర్తయితే గాని రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్ను రోబో సీక్వల్ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement