గాల్లో కన్నై గస్తీ కాసే గూఢచారి! | mahesh babu new movie spyder updates | Sakshi
Sakshi News home page

గాల్లో కన్నై గస్తీ కాసే గూఢచారి!

Published Wed, Sep 13 2017 12:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

గాల్లో కన్నై  గస్తీ కాసే గూఢచారి! - Sakshi

గాల్లో కన్నై గస్తీ కాసే గూఢచారి!

విధ్వంసం సృష్టించడానికి శత్రువులు స్కెచ్‌ వేశారు. కానీ, ఎగ్జిక్యూట్‌ చేసే లోపే ఆ స్కెచ్‌ని ఒక స్పై (గూఢచారి) కనిపెట్టి, ప్లాన్‌ని విఫలం చేస్తాడు. ఈసారి శత్రువులు మరొకటి ప్లాన్‌ చేయాలనుకున్నారు. ఈసారి వాళ్లే విఫలమైపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా... ఈ స్పై ఎలాంటోడో... గాల్లో కన్నై గస్తీ కాస్తాడు. జరిగిన తప్పును, వచ్చే ముప్పును చేధిస్తాడు. అచ్చు ఇలాంటి స్పై రోల్లోనే మహేశ్‌బాబు హీరోగా ఏ.ఆర్‌. మురగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్పైడర్‌’ చిత్రం రూపొందింది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. హ్యారీశ్‌ జయరాజ్‌ స్వరకర్త. ఈ చిత్రంలో ‘బూమ్‌.. బూమ్‌...’ పాటను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాటలో ‘గాల్లో కన్నై గస్తీ కాస్తాడు...’ అంటూ హీరో రోల్‌ ఎంత పవర్‌ఫుల్లో చెప్పారు. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీఆర్‌ సినిమా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ను ఈ 15న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరపనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement