Mahesh Babu And Kamal Hassan In A R Murugadoss Multi Starrer Movie - Sakshi
Sakshi News home page

మహేశ్‌-కమల్‌తో క్రియేటివ్‌ డైరెక్టర్‌ భారీ ప్రాజెక్ట్‌!

Published Fri, Jun 4 2021 5:31 PM | Last Updated on Fri, Jun 4 2021 9:22 PM

AR Murugadoss Plans To Cast Mahesh Babu And Kamal Hassan For Multi Starrer Movie - Sakshi

ఈ మధ్యకాలంలో పరిశ్రమతో సంబంధంగా లేకుండా స్టార్‌ డైరెక్టర్లు, స్టార్‌ హీరోల కాంబినేషన్లు సెట్‌ అవుతున్నాయి. కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే ప్రభాస్‌తో సలార్‌ మూవీ తెరకెక్కిస్తుండగా, ఇక సెన్సెషనల్‌ దర్శకుడు శంకర్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీ తీయబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో క్రేజీ కాంబినేషన్‌ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌లతో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగుదాస్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేశ్‌ ఇందులో సీబీఐ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, కమల్ హాసన్‌ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తాడని వినికిడి. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలి అంటే దీనిపై డైరెక్టర్‌ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే మురుగుదాస్‌ గ‌తంలో మ‌హేశ్‌తో స్పైడ‌ర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్స్‌గా అంతగా సక్సెస్ అందుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement