స్పై సెప్టెంబర్‌! | Murugadoss's 'Spyder' release postponed again | Sakshi
Sakshi News home page

స్పై సెప్టెంబర్‌!

Published Thu, May 25 2017 12:18 AM | Last Updated on Fri, May 25 2018 2:49 PM

స్పై సెప్టెంబర్‌! - Sakshi

స్పై సెప్టెంబర్‌!

వెయిటింగ్‌... వెయిటింగ్‌... మహేశ్‌బాబు అభిమానులు ఎప్పట్నుంచో ‘స్పైడర్‌’ను ఎప్పుడు విడుదల చేస్తారోనని వెయిట్‌ చేస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కి తగ్గట్టు మహేశ్‌ బర్త్‌డే (ఆగస్టు 9) కానుకగా ఆగస్టు సెకండ్‌ వీక్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యారు. కట్‌ చేస్తే... అభిమానులకు చిన్న షాక్‌! చిత్రనిర్మాతలు ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు ‘స్పైడర్‌’ను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.

 కారణం ఏంటంటే... ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను షూట్‌ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీతో క్లైమాక్స్‌ షెడ్యూల్‌ ముగుస్తుంది. తర్వాత బ్యాలెన్స్‌ రెండు సాంగ్స్‌ షూట్‌ చేయడం కోసం ఫారిన్‌ వెళతారు. షూటింగ్‌ ఫాస్ట్‌గా పూర్తయినా... పోస్ట్‌ ప్రొడక్షన్‌ అండ్‌ గ్రాఫిక్‌ వర్క్స్‌కి ఎక్కువ టైమ్‌ కావాలని దర్శకుడు ఏఆర్‌ మురుగుదాస్‌ అడిగారట! అదీ మేటర్‌. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement