స్పైడర్ : మహేష్ 23 లుక్ వచ్చేసింది..!
ఎన్నో రోజుల సూపర్ స్టార్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. తన ప్రతీ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మురుగదాస్ ఈ లుక్ కోసం కూడా భారీ కసరత్తులే చేశాడు. అందుకు తగ్గట్టుగా అవుట్ పుట్ కూడా అదిరిపోయింది.
మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈసినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా మహేష్ తో జత కడుతోంది. హీరో విలన్ మధ్య నడిచే ఎత్తులు పై ఎత్తులే ప్రధాన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకం తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ అవుతోంది.
#SPYderFirstLook https://t.co/ocDvwPaFbu #Mahesh23FLDay @urstrulyMahesh @ARMurugadoss @Rakulpreet @Shibasishsarkar @RelianceEnt @NVRCinema
— SpyderTheMovie (@spyderthemovie) 12 April 2017