
సాక్షి, రాజమండ్రి: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లెక్సీకి నిప్పుపెట్టడంతో రాజమండ్రిలో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని నందం గోవిందరాజు సెంటర్‌లో ఏర్పాటుచేసిన మహేష్ బాబు భారీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తగలబెట్టారు. ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మహేశ్‌బాబు తాజా సినిమా 'స్పైడర్' సూపర్ హిట్ కావడంతో తట్టుకోలేకనే దుండగులు ఈ పనికి ఒడిగట్టారని, ప్లెక్సీని తగలబెట్టినవారిని గుర్తించి పట్టుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.