
శివాజీనగర (బెంగళూరు): తెలుగు సినిమాలను ఉభయ రాష్ట్రాల తర్వాత బెంగళూరు ప్రజలే ఎక్కువగా ఆదరిస్తారని సినీ హీరో మహేశ్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా ప్రచారం కోసం ఆదివారం ఆయన బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు సినిమాలను బెంగళూరు ప్రేక్షకులు బాగా ఆదరించారని, స్పైడర్‌ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత ఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.