మహేష్ రేంజ్ పడిపోతోందా..? | Mahesh babu at 7th Place in Most Desirable Mens List | Sakshi
Sakshi News home page

మహేష్ రేంజ్ పడిపోతోందా..?

Published Tue, Jun 27 2017 12:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

మహేష్ రేంజ్ పడిపోతోందా..?

మహేష్ రేంజ్ పడిపోతోందా..?

ఇటీవల రిలీజ్ అయిన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్, సూపర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చింది. గతంలో ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న మహేష్, ఈ ఏడాది ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2015లో ఆరో స్థానంలో నిలిచిన మహేష్ ఈ ఏడాది మరో ర్యాంక్ వెనక్కి తగ్గాడు. ఈ లిస్ట్లో నెంబర్ వన్ గా మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ ఉండగా తరువాత వరుసగా విరాట్ కోహ్లి, హృతిక్ రోషన్, రన్వీర్ సింగ్, ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్నారు.

సౌత్ నుంచి నుంచి ప్రభాస్ 22, రానా 24, ధనుష్ 26 రాంక్యులతో సరిపెట్టుకున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన మహేష్ బాబు, నెక్ట్స్ సినిమా స్పైడర్  రిలీజ్కు చాలా టైం తీసుకుంటున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement