Vijaya Devarakonda is in the Top Position of the List of Hyderabad Time's Most Desirable Men 2018 - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌, మహేష్‌లను వెనక్కి నెట్టిన విజయ్‌

Published Thu, Mar 14 2019 10:21 AM | Last Updated on Thu, Mar 14 2019 11:01 AM

Vijay Devarakonda Topped The List of The Most Desirable Men 2018 - Sakshi

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్‌ పరంగానూ విజయ్‌ ఇమేజ్‌ తారాస్థాయికి చేరింది. పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు విజయ్‌ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా 2018 హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో విజయ్ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. హైదరాబాద్‌ టైమ్స్ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ టాప్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి విజయ్‌ మొదటి స్థానం దక్కించుకున్నాడు.

గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన విజయ్‌ దేవరకొండ, ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచి సత్తా చాటాడు. గత ఏడాది తొలి స్థానం సాధించిన మోడల్ బసీర్‌ అలీ ఈ ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement