Most Desirable Mens
-
అదీ విజయ్ క్రేజ్! ఆలిండియాలో సెకండ్ ప్లేస్
'అర్జున్‌రెడ్డి'లో రఫ్ లుక్‌తో భయపెట్టినా, 'గీతా గోవిందం'లో మేడం మేడం అంటూ ఇన్నోసెంట్‌గా కనిపించినా అది ఒక్క విజయ్ దేవరకొండకే చెల్లుతుంది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి ఎంతో సహజంగా నటించే ఈ రౌడీ హీరోకు బాలీవుడ్ స్టార్స్‌ను మించిన క్రేజ్ ఉంది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ పట్టం అందుకున్న ఇతడు మరో అరుదైన ఘనత సాధించాడు. ఆలిండియా లెవల్లో 'టాప్ 50 డిజైరబుల్ మెన్ ఆఫ్ 2020' జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది మూడో స్థానంలో ఉన్న విజయ్ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌ను వెనక్కు తోసి మరీ రెండో ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. ఇక రణ్వీర్ సింగ్ ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. 2019లో 11వ స్థానంలో ఉన్న ఆదిత్య రాయ్ కపూర్ ఈసారి 3వ స్థానంలోకి దూసుకురావడం విశేషం. విక్కీ కౌశల్ గతేడాది సంపాదించుకున్న నాల్గవ స్థానంలోనే స్థిరంగా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ 5, విరాట్ కోహ్లి 6వ స్థానంలో నిలిచారు. గుర్ఫతేహ్ సింగ్ పిర్జాదా(9వ ర్యాంకు), ఇశ్వాక్ సింగ్(18), పవేల్ గులాటి(19), అలీ గోని(22), అక్షయ్ ఒబెరాయ్(31), వత్సల్ సేత్(36), విశ్నాల్ నికమ్(37), రోహిత్ సరఫ్(39), శుభ్‌మన్ గిల్(41), నిషాంత్ మల్కాని(44), యశ్‌దాస్ గుప్తా(46), నీల్ భట్(48), అవినాష్ తివారి(49) మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో కొత్తగా చేరారు. Rowdy @TheDeverakonda at Top - 2 in India's Most desirable men 2020 #TimesMostDesirableMen2020 #MostDesirableManVijayDeverakonda pic.twitter.com/sxHSWYSFMw — BARaju's Team (@baraju_SuperHit) June 4, 2021 చదవండి: Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ -
ఎన్టీఆర్ దూకుడు, వెనకబడ్డ అల్లు అర్జున్!
హైదరాబాద్ టైమ్స్ ప్రతి యేటా ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి మొదటి స్థానంలో నిలిచాడు. వరుసగా మూడోసారి విజయ్ తన మొదటి ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గతేడాది మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకోగా ఈసారి మాత్రం రెండో స్థానానికి ఎగబాకాడు. 2019లో 19వ ర్యాంకులో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం ఏకంగా మూడో స్థానంలోకి దూసుకురావడం కొసమెరుపు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ గతంలోకన్నా రెండు స్థానాలు దిగజారి నాలుగో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. తొలిసారి మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో చోటు దక్కించుకున్న నాగశౌర్య ఐదవ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది 12వ స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ఈసారి 16వ స్థానానికి పడిపోయాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ 14వ స్థానం సంపాదించుకున్నాడు. సినిమా సెలబ్రిటీలతో పాటు క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సిరాజ్ కూడా ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నారు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2020 ర్యాంకులివే.. 1. విజయ్ దేవరకొండ 2. రామ్ పోతినేని 3. జూనియర్ ఎన్టీఆర్ 4. రామ్‌చరణ్ 5. నాగశౌర్య 6. నాగచైతన్య 7.ముస్తఫా దావూద్ 8. సల్మాన్ జైదీ 9. సందీప్ కిషన్ 10. నవదీప్ 11. రానా దగ్గుబాటి 12. సిద్ధు జొన్నలగడ్డ 13. మొహమ్మద్ సిరాజ్ 14. అఖిల్ సార్థక్ 15. సుధీర్ బాబు 16. అల్లు అర్జున్ 17. వరుణ్ తేజ్ 18. బషీర్ అలీ 19. కార్తికేయ 20. అఖిల్ అక్కినేని 21. ఆనంద్ దేవరకొండ 22. అడివి శేష్ 23. శ్రవణ్ రెడ్డి 24. విశ్వక్ సేన్ 25. నితిన్ 26. నాని 27. ఆది పినిశెట్టి 28.కిదాంబి శ్రీకాంత్ 29. ప్రణవ్ చాగంటి 30. తరుణ్ భాస్కర్ చదవండి: దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తిక విషయాలు చెప్పిన ఆయన తండ్రి -
ప్రభాస్, మహేష్‌లను వెనక్కి నెట్టిన విజయ్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్ పరంగానూ విజయ్ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు విజయ్ ఇమేజ్ను తారా స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా 2018 హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ లిస్ట్‌లో విజయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి విజయ్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ, ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచి సత్తా చాటాడు. గత ఏడాది తొలి స్థానం సాధించిన మోడల్ బసీర్ అలీ ఈ ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు. -
మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌లో ప్రభాస్, మహేశ్
సాక్షి, ముంబై: ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు స్థానం దక్కించుకున్నారు. 2017 ఏడాదికి గానూ విడుదల చేసిన జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తొలి స్థానంలో నిలవగా.. ప్రభాస్ రెండో ప్లేస్‌లో నిలిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, సిధార్థ్ మల్హోత్రాలు 3,4,5వ స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 6వ స్థానంలో నిలవగా.. దగ్గుబాటి రానా ఏడో స్థానం దక్కించుకున్నారు. మళయాళం యువ హీరో దుల్కర్ సల్మాన్ 9వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్ యువ మోడల్ బషీర్ అలీ 17వ స్థానం దక్కించుకున్నాడు. పాపులారిటీ, క్రేజ్‌ను ఆధారంగా చేసుకుని మొత్తం 50 మంది పేర్లతో ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ పేరిట టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను విడుదల చేస్తుంటుంది. బాహుబలి సిరీస్ మూలంగా ప్రభాస్ పేరు దేశం మొత్తం పాకిపోగా.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. వచ్చే ఏడాది సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాప్ స్టార్లకు షాకిచ్చిన ‘అర్జున్ రెడ్డి’
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఈసినిమాలో యూత్ ఆడియన్స్ కు ఫేవరెట్ స్టార్‌గా మారిన విజయ్ ఆన్లైన్ పోల్స్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017 లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్లకు షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రభాస్, మహేష్ బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్ లాంటి హీరోలకు వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో పలు టీవీ రియాలిటీ షోలలో పాల్గొన్న బసీర్ అలీ తొలి స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 20 స్థానాలు ముందుకు వచ్చాడు విజయ్. తరువాతి స్థానాల్లో వరుసగా ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటిలతో ఇతర టాలీవుడ్ స్టార్లు ఉన్నారు. -
మహేష్ రేంజ్ పడిపోతోందా..?
ఇటీవల రిలీజ్ అయిన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్, సూపర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చింది. గతంలో ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న మహేష్, ఈ ఏడాది ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2015లో ఆరో స్థానంలో నిలిచిన మహేష్ ఈ ఏడాది మరో ర్యాంక్ వెనక్కి తగ్గాడు. ఈ లిస్ట్‌లో నెంబర్ వన్ గా మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ ఉండగా తరువాత వరుసగా విరాట్ కోహ్లి, హృతిక్ రోషన్, రన్వీర్ సింగ్, ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్నారు. సౌత్ నుంచి నుంచి ప్రభాస్ 22, రానా 24, ధనుష్ 26 రాంక్యులతో సరిపెట్టుకున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన మహేష్ బాబు, నెక్ట్స్ సినిమా స్పైడర్ రిలీజ్‌కు చాలా టైం తీసుకుంటున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.