
మహేష్ కోసం భారీ వేడుక..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇదే తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. దీంతో మహేష్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు నిర్మాతలు కష్టపడుతున్నారు.
ఇప్పటివరకు స్పైడర్ సినిమాకు మురుగదాస్ పేరు మీదే కోలీవుడ్ లో బిజినెస్ జరిగింది. అందుకే మహేష్ బాబు కోలీవుడ్ జనాలకు సూపర్ స్టార్ గా ప్రజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం త్వరలో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీ వేడుకతో మహేష్ ను లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.