సూపర్ స్టార్తో సెకండ్ ఛాన్స్..! | rakul preet second time with mahesh babu | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్తో సెకండ్ ఛాన్స్..!

Published Tue, Apr 18 2017 1:33 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

సూపర్ స్టార్తో సెకండ్ ఛాన్స్..!

సూపర్ స్టార్తో సెకండ్ ఛాన్స్..!

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న టాలీవుడ్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ గొల్డెన్ ఆఫర్ సొంతం చేసుకుంది. ఇప్పటికే టాలీవుడ్

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న టాలీవుడ్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ గొల్డెన్ ఆఫర్ సొంతం చేసుకుంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన ఈ బ్యూటి, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మరోసారి నటించే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు కోలీవుడ్ మూవీస్ తోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటి, మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది.

తాజాగా మహేష్ తదుపరి చిత్రంలోనూ రకుల్నే హీరోయిన్ ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. స్పైడర్ షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమాను ప్రారంభించనున్నాడు ప్రిన్స్. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీస్ కైరా అద్వానీ, దిశాపటానీ లాంటి వాళ్లను ట్రై చేసినా.. ఫైనల్గా రకుల్కే ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించిన రకుల్, ఇప్పుడు మహేష్ తోనూ అదే ఫీట్ను రిపీట్ చేయబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement