
స్పైడర్ వాయిదాకు కారణం అదేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాను వందకోట్లకు పైగా బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ భారీ చిత్రానికి సంబందించిన అప్ డేట్స్ సూపర్ స్టార్ అభిమానులను కలవరపెడుతున్నాయి. సినిమా క్లైమాక్స్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేడని అందుకే రీషూట్ చేస్తురన్న ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా స్పైడర్ యూనిట్ తీసుకున్న నిర్ణయం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. స్పైడర్ సినిమా జూన్ 23 రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ అఫీషియల్ గా ప్రకటించాడు. అయితే సడన్ గా నిర్మాత సినిమా వాయిదా పడిందని కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అయితే కనీసం రెండు నెలలు వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది ఆగస్టు 11న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆలస్యానికి రీ షూట్ లే కారణమని భావిస్తున్నారు ఫ్యాన్స్. అసలు నిజమేంటో తెలియాలంటే యూనిట్ ను ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.