మహేష్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అనుష్క | Bhagamathi Anushka looking for Mahesh Spyder release date | Sakshi
Sakshi News home page

మహేష్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అనుష్క

Published Thu, May 18 2017 11:30 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

మహేష్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అనుష్క

మహేష్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అనుష్క

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యోగా బ్యూటీ అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న భాగమతిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పిల్ల జమిందార్, సుకుమారుడు లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలను తెరకెక్కించిన అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. మొదట్లో ఇది హిస్టారికల్ మూవీ అన్న ప్రచారం జరిగినా.. చిత్రయూనిట్ ఆ వార్తలను ఖండించారు.

థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ సభ్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను అదే సమయంలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో భాగమతి యూనిట్ ఆలోచనలో పడ్డారు.

స్పైడర్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉండటంతో.. మహేష్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన తరువాతే తమ సినిమా రిలీజ్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు. మహేష్ స్పైడర్ వాయిదా పడితే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 11న భాగమతి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు స్పైడర్ రిలీజ్ అయితే రెండు వారాలు ఆలస్యంగా ఆగస్టు 25న భాగమతి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement