సూపర్ స్టార్ సినిమా రీమేక్లో సూపర్ హీరో..? | Hrithik Roshan to act in Spyder Hindi Remake | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ సినిమా రీమేక్లో సూపర్ హీరో..?

Published Tue, Aug 8 2017 3:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

సూపర్ స్టార్ సినిమా రీమేక్లో సూపర్ హీరో..?

సూపర్ స్టార్ సినిమా రీమేక్లో సూపర్ హీరో..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్ కు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉండటంతో స్సైడర్ ను అక్కడ కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మాత్రం ఇందుకు అడ్డుపడుతున్నాడట. స్పైడర్ సినిమాను బాహుబలి తరహాలో కరణ్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తారని భావించారు. అయితే తాజాగా కరణ్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయటం కాకుండా రీమేక్ హక్కులు తీసుకొని తిరిగి నిర్మించే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది.

స్పైడర్ జేమ్స్ బాండ్ తరహా కథ కావటంతో బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తో ఈసినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే స్పైడర్ సినిమా డబ్ చేయకుండా తనకు రీమేక్ హక్కులు ఇవ్వాలని కోరుతున్నాడట. అయితే ప్రస్తుతానికి స్పైడర్ టీం మాత్రం ఈ సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగానే ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement