జ్యో అచ్యుతానంద సెట్లో మహేష్ | Murugadoss, Mahesh babu team to use Jyo achyuthananda set | Sakshi
Sakshi News home page

జ్యో అచ్యుతానంద సెట్లో మహేష్

Published Thu, Sep 15 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

జ్యో అచ్యుతానంద సెట్లో మహేష్

జ్యో అచ్యుతానంద సెట్లో మహేష్

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ జ్యో అచ్యుతానంద. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వపూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో హీరోల ఇంటి సెట్లో త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ చేయనున్నాడట.

గతంలో జనతా గ్యారేజ్ కోసం వేసిన గ్యారేజ్ సెట్లో మహేష్, ఓ పాటతో పాటు ఓ యాక్షన్ సీన్ కూడా షూట్ చేయనున్నాడన్న టాక్ వినిపించింది. తాజాగా జ్యో అచ్యుతానంద సెట్లోనూ మహేష్ సందడి చేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. 90లలోని మిడిల్ క్లాస్ ఇంటి తరహా సెట్ వేసే ఆలోచనలో ఉన్న మురుగదాస్, జ్యో అచ్యుతానంద సెట్ నచ్చటంతో అదే సెట్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట.

ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ త్వరలోనే హైదరాబాద్లో భారీ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ రోల్లో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement