
సూపర్ స్టార్, ఈ ఏడాది కూడా ఒక్కటే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాను ప్రారంభించిన మహేష్.. ప్రస్తుతం ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా మార్చి లోగా పూర్తి చేసి వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాలని భావించాడు. ఆ సినిమాను కూడా ఈ ఏడాది దీపావళి నాటికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.
అయితే మరోసారి మహేష్ అభిమానులకు నిరాశే మిగిలేలా ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆలస్యమవుతుండటంతో కొరటాల సినిమాను మరింత ఆలస్యంగా ప్రారంభించనున్నారు. దీంతో దీపావళికి అనుకున్న సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా సూపర్ స్టార్ నుంచి కేవలం ఒక్క సినిమానే రానుంది.