
అభిమన్యుడు?
మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గురించి ప్రస్తుతం ఫిలిం నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గురించి ప్రస్తుతం ఫిలిం నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ మధ్య ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం శ్రీదేవి కుమార్తె జాన్వీని అడిగారనీ, తను ఒప్పుకోలేదనీ ఓ వార్త ప్రచారమైంది. వాస్తవానికి ఈ చిత్రబృందానికి జాన్వీని తీసుకోవాలనే ఆలోచన లేదు.
కానీ, ఎవరో పుట్టించిన ఈ గాసిప్ మాత్రం బాగానే నలుగురి నోళ్లల్లో నానింది. ఇప్పుడు నానుతున్న వార్త ఏంటంటే.. ఈ చిత్రానికి ‘అభిమన్యుడు’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట.ఇందులో మహేశ్‌బాబు ఐబీ ఆఫీసర్ (ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్) పాత్ర చేస్తు న్నారు. అందుకే ఈ టైటిల్ అయితే యాప్ట్‌గా ఉంటుందనుకుంటున్నారట. మరి.. ఇది గాసిప్‌గానే మిగిలిపోతుందా? నిజమవుతుందా? అన్నది తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది.