ఇంకాస్త ఓపిక పట్టండి : మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు ఇంత వరకు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయలేదు. చాలా పేర్లు ప్రచారంలో ఉన్నా, యూనిట్ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు.
ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో అభిమానులను శాంతింప చేయడానికి మహేష్ బాబు రంగంలోకి దిగక తప్పలేదు. మురుగదాస్ మూవీపై తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మహేష్, అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశాడు. ' ప్రియమైన నా అభిమానులందరికీ, మీ అందరూ మహేష్ 23 సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మా యూనిట్ రాత్రింబవళ్లు షూటింగ్ చేస్తుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు.
మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా టైటిల్స్ అంటూ ఎనిమి, సంభవామి, స్పైడర్ లాంటి పేర్లు చాలా వినిపించినా. యూనిట్ సభ్యులు మాత్రం ఇంతవరకు ఏ టైటిల్ ను కన్ఫామ్ చేయలేదు.
To all my dearest fans, I know you have been eagerly waiting for the first look of #Mahesh23. Our team is shooting day & night for the film.
— Mahesh Babu (@urstrulyMahesh) 30 March 2017
The first look will be out very soon...Requesting you all to be a little patient. Love you guys as always :)
— Mahesh Babu (@urstrulyMahesh) 30 March 2017