రెహమాన్ స్వరం.. విజయ్ గళం | Hero Vijay to sing for AR Rahman | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 7:18 AM | Last Updated on Thu, Mar 29 2018 7:18 AM

Hero Vijay to sing for AR Rahman - Sakshi

కోలీవుడ్ టాప్‌ హీరో విజయ్‌ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌ లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాదించటంతో ఈ కాంబినేషన్‌పై మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ కోలీవుడ్ లో హల్‌ చల్‌ చేస్తోంది.

ఈ సినిమాలో హీరో విజయ్‌ ఓ పాటను ఆలపించనున్నారు. గతంలో విజయ్ పలు చిత్రాల్లో పాటలు పాడినా.. రెహమాన్ సంగీతదర్శకత్వంలో పాట పాడటం ఇదే తొలిసారి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్, ప్రేమ్‌ కుమార్‌, రాధారవిలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement