సూపర్ స్టార్తో మరో సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సినిమాలకు ఎప్పుడు సాంకేతిక నిపుణులుగా ఒకే టీంను కంటిన్యూ చేస్తుంటాడు. అప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న టెక్నిషియన్స్తోనే కలిసి పనిచేసేందుకు ఇష్టపడే మహేష్, ఎక్కువగా తన సినిమాలకు మణిశర్మతో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆ తరువాత దేవీ శ్రీ ప్రసాద్ టాప్ పొజిషన్కు రావటంతో తనతో మ్యూజిక్ చేయించుకున్నాడు. కానీ థమన్ విషయంలో మాత్రం ముందే స్పందించాడు. తమన్ కెరీర్ స్టార్టింగ్లోనే దూకుడు సినిమా ఇచ్చిన మహేష్, తరువాత బిజినెస్మేన్, ఆగడు సినిమాలకు కూడా థమన్తో కలిసి పనిచేశాడు.
అయితే తాజాగా మరోసారి థమన్, మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన థమన్, ఏ సినిమాకు మహేష్తో కలిసి పనిచేయబోయేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల తరువాత పీవీపీ బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్. అయితే ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ మ్యూజిక్ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రకటించిన సినిమాలకు సంగీత దర్శకుడు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు, మరి థమన్ సంగీతం అందించే సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.