
3 కోట్లతో భారీ ఫైట్ సీన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త...
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ ఫైట్ సీన్ను భారీగా తెరకెక్కిస్తున్నారట.
ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ ఫైట్ సన్నివేశాన్ని దాదాపు 3 కోట్ల రూపాయిలతో తెరకెక్కిస్తున్నరట. ఈ సీన్లో భారీ కార్ చేజ్, బోట్ చేజ్తో పాటు కొంత యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్కు సంబందించిన అప్ డేట్స్ను చిత్రయూనిట్ సీక్రెట్గా ఉంచుతున్న, ఇలాంటి ప్రచారాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.