కథలు వినడంలో బిజీ | Mahesh Babu doing great at Tamil strategy | Sakshi
Sakshi News home page

కథలు వినడంలో బిజీ

Published Mon, Apr 11 2016 10:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

కథలు వినడంలో బిజీ

కథలు వినడంలో బిజీ

‘బ్రహ్మోత్సవం’ చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్న మహేశ్‌బాబు, ఓ పక్క తన తదుపరి సినిమాలకు స్క్రిప్ట్‌లు వింటూ ఓకే చేసేస్తున్నారా? వరుస చూస్తే అలానే ఉంది. ఇప్పటికే మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి అభిమానులకు ఓ క్లారిటీ  ఇచ్చేశారు మహేశ్. తాజాగా మరో తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఆయన ఇంప్రెస్ అయ్యారట.  ‘రాజా-రాణి’ ఫేమ్ అట్లీ ‘పోలీసోడు’(తమిళంలో ‘తెరి’) చిత్రంతో ప్రేక్షకులను పలకరించడడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన  అట్లీ ‘బ్రహ్మోత్సవం’ సెట్‌లోనే మహేశ్‌ను కలిసి, ఒక కథ వినిపించారట. ఆ కథ బాగా నచ్చేసి, స్క్రిప్ట్‌గా డెవలప్ చేసుకురమ్మని మహేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. మహేశ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు రొమాంటిక్, హై వోల్టేజ్ యాక్షన్  ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దే పనిలో అట్లీ ఉన్నట్టు భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement