అట్లీ డెరైక్షన్‌లో మహేశ్‌బాబు | 'Theri' creator Atlee Kumar to direct Mahesh Babu? | Sakshi
Sakshi News home page

అట్లీ డెరైక్షన్‌లో మహేశ్‌బాబు

Published Thu, Apr 14 2016 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

అట్లీ డెరైక్షన్‌లో మహేశ్‌బాబు

అట్లీ డెరైక్షన్‌లో మహేశ్‌బాబు

కోలీవుడ్‌లో లేటెస్ట్‌గా ఒక కొత్త న్యూస్ హల్‌చల్ చేస్తోంది. యువ దర్శకుడు అట్లీ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబును డెరైక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఈ క్రేజీ వార్త. రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే దక్షిణాది చిత్రపరిశ్రమ దృష్టి తన వైపు చూసేలా చేసుకున్నారు. స్టార్ దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లీకి రాజారాణి చిత్ర విజయం తరువాత పలు అవకాశాలు తలుపు తట్టాయి. ఆయన మాత్రం ఇళయదళపతి విజయ్‌ను దర్శకత్వం చేసే అవకాశాన్ని ఎంచుకున్నారు. వీరి కలయికలో కలైపులి ఎస్ థాను నిర్మించిన తెరి చిత్రం భారీ అంచనాల మధ్య రేపు(గురువారం) తెరపైకి రానుంది.

అట్లీ తాజాగా మరో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు గురి పెట్టారన్నది తాజా సమాచారం. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మోత్సవం చిత్ర షూటింగ్‌లో ఉన్న మహేశ్‌బాబును కలసి కథ వినిపించినట్లు, ఆ కథ తెగ నచ్చేయడంతో నటించడానికి అంగీకరించిన మహేశ్‌బాబు దాన్ని డెవలప్ చేయమని చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది.

ఈ మధ్య కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్న మహేశ్‌బాబు తన చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో రూపొందేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజా చిత్రం బ్రహ్మోత్సవం చిత్రం ద్విభాషాచిత్రంగా తెరకెక్కుతోంది. ఇక అట్లీ దర్శకత్వంలో నటించే చిత్రం అదే తరహాలో ఉంటుందని ఆశించవచ్చు. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement