
జాతీయ అవార్డుల జ్యూరీపై డైరెక్టర్ ఫైర్
సినీరంగానికి సంబంధించి ఇచ్చే అవార్డులు ఎప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంటాయి. జ్యూరీ సభ్యులు తమకు సంబంధించిన వారికే అవార్డులు ఇచ్చారన్న వాదన ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులపై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. కొంత మంది ప్రముఖులు జ్యూరీ నిర్ణయం పై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మరో అడుగు ముందుకేసి జ్యూరీ సభ్యులు పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ విమర్శలకు దిగారు.
జాతీయ అవార్డుల ప్రకటన తరువాత తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మురుగదాస్ జ్యూరీ సభ్యులపై ఒత్తిళ్లు ఉన్నాయని, పక్షపాతం తోనే అవార్డుల ఎంపిక జరిగిందనట్టుగా స్పష్టమవుతుందని విమర్శించాడు. మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా జూన్ 23న రిలీజ్ అవుతోంది.
#NationalAwards
— A.R.Murugadoss (@ARMurugadoss) 8 April 2017
Can clearly witness the influence & partiality of people in jury, it's biased.