మహేష్ మూవీకి వెరైటీ టైటిల్ | intresting title for mahesh babu, murugadoss movie | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీకి వెరైటీ టైటిల్

Published Wed, Jun 29 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

మహేష్ మూవీకి వెరైటీ టైటిల్

మహేష్ మూవీకి వెరైటీ టైటిల్

బ్రహ్మోత్సవం రిజల్ట్తో షాక్ తిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ మెసేజ్...

బ్రహ్మోత్సవం రిజల్ట్తో షాక్ తిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. మురుగదాస్ మార్క్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే కథ కథానాలు రెడీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ముందుగా ఈ సినిమాకు టైటిల్గా 'ఎనిమీ', 'చట్టంతో పోరాటం' అనే పేర్లు వినిపించాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టైటిల్ను ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. గతంలో కథకు సంబందం లేకపోయినా గజిని టైటిల్తో సినిమాను తెరకెక్కించిన మురుగదాస్ మంచి విజయం సాధించాడు.

అదే తరహాలో మహేష్ సినిమాకు 'వాస్కోడాగామ' అనే టైటిల్ను పెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా దర్శకుడు మాత్రం ఇదే టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హైదరాబాద్తో పాటు పుణె, రాజస్థాన్, ముంబైలలో చిత్రీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement