![Vijay Murugadoss Sarkar Story Issue Settled - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/30/Murugadoss.jpg.webp?itok=m7Ucf3BB)
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, స్టార్ హీరో విజయ్ ల కాంబినేషన్‌లో సర్కార్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా తెరమీదకు వచ్చిన వివాదం సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలిగేలా చేసింది. వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి సర్కార్ కథ నాదే అని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ విషయంపై ముందుగా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పిన దర్శకుడు తరువాత మాట మార్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్కార్ కథ వరుణ్ రాజేంద్రన్‌దే అని అంగీకరించటంతో పాటు 30 లక్షల పారితోషికం, సినిమా టైటిల్స్‌లో వరుణ్‌కు క్రెడిట్ ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment