గతంలో బాలీవుడ్ కు, రీజనల్ సినిమాకు చాలా దూరం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగు సినిమా స్థాయి పెరగటంతో బాలీవుడ్ తో సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు, బాలీవుడ్ టాప్ హీరోలు మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ మెగా, అక్కినేని కుటుంబాలతో తనకున్న స్నేహాన్ని సినిమాల ద్వారా చూపించాడు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ హీరో చేరబోతున్నాడు.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. తాజాగా మహేష్ బాబు సినిమాకు మాసాయం చేయనున్నాడట. మహేష్ సినిమాకు అమీర్ చేసే మాట సాయం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్, ఆ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న మహేష్.. హిందీలో మాత్రం వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. ఇటీవల సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమాకు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పటంతో అదే ఫార్ములాను మహేష్ మూవీ కోసం ఫాలో అవుతున్నారు. మహేష్, మురుగదాస్ ల కాంభినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు అమీర్ ఖాన్ తో డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నారట. గతంలో మురుగదాస్ డైరెక్షన్ లో గజిని లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన అమీర్, మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తప్పకుండా అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
మహేష్ కు అమీర్ మాటసాయం
Published Sun, Nov 8 2015 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM
Advertisement
Advertisement