
నవంబర్ 9న మహేష్ కొత్త సినిమా ప్రారంభం
బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న...
బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా ప్రారంభించేస్తున్నాడు మహేష్.
ఇప్పటికే ప్రకటించినట్టుగా కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. తన సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలకు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ కొరటాలతో చేయబోయే సినిమాను కూడా మహేష్ లేకుండానే మొదలు పెడుతున్నారు. డిసెంబర్ చివరకల్లా మహేష్, మురుగదాస్ల సినిమా పూర్తి కానుంది, ఆ తరువాత కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ అవుతుంది.