కథ కోసం కోటి రూపాయలు..? | Koratala siva spent one crore to get the story For Mahesh | Sakshi
Sakshi News home page

కథ కోసం కోటి రూపాయలు..?

Published Wed, Apr 5 2017 3:47 PM | Last Updated on Thu, May 10 2018 12:13 PM

కథ కోసం కోటి రూపాయలు..? - Sakshi

కథ కోసం కోటి రూపాయలు..?

శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. పేరు నిర్ణయించని ఈ సినిమాలో సూపర్ స్టార్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్ను పరిశీలుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తన గత చిత్రాలను సొంత కథలతో తెరకెక్కించిన కొరటాల శివ, మహేష్ కోసం వేరే రచయిత నుంచి కథను తీసుకున్నాడు.

తకిట తకిట, సత్యభామ లాంటి సినిమాలను తెరకెక్కించిన నాను శ్రీహరి, మహేష్ సినిమాకు కథ అందిస్తున్నాడు. కెరీర్లో ఒక్క హిట్ కూడా లేని ఈ దర్శకుడు మహేష్ సినిమా కథకు మాత్రం ఏకంగా కోటి రూపాయలు చార్జ్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉండటంతో ఎంత పెట్టైనా కథను తీసుకోవాలని నిర్ణయించారు. అంత భారీ ధర పలికిన ఈ కథ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement