
టెన్షన్ పెడుతున్న సూపర్ స్టార్ సెంటిమెంట్
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. మురుగదాస్ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిపోవటంతో నెక్ట్స్ సినిమా పనులు ప్రారంభించాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాకు ఓకె చెప్పాడు మహేష్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.
ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఆలోచనే ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో మహేష్ సరసన కొత్త అమ్మాయిలను పరిచయం చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. వంశీ, టక్కరిదొంగ, అతిథి, 1 నేనొక్కడినే సినిమాల్లో కొత్త హీరోయిన్లతో జతకట్టాడు మహేష్. అయితే ఈ సినిమాలన్నీ మహేష్కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అందుకే మరోసారి కొత్త భామతో కలిసి నటిస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్లో ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులు.