మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది..? | keerthi suresh movie with mahesh babu | Sakshi
Sakshi News home page

మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది..?

Published Wed, Jan 20 2016 5:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది..?

మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది..?

తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మలయాళీ భామ కీర్తి సురేష్. రామ్ హీరోగా తెరకెక్కిన 'నేనూ శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కీర్తి సురేష్. గతంలోనే విజయనిర్మల మనవడు హీరోగా తెరకెక్కిన 'ఐనా ఇష్టం నువ్వు' అనే సినిమాలో కీర్తి హీరోయిన్గా నటించినా.., ఆ సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు. దీంతో రెండో సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లో మెరిసిన ఈ భామ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటికే రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్ రీమేక్లో కీర్తి సురేష్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తుండగా, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడిని వరించింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా చాలామంది బాలీవుడ్ తారల పేర్లు వినిపించినా, ఫైనల్గా కీర్తి సురేష్నే ఫైనల్ చేశారట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఈ రెండు సినిమాలు కన్ఫామ్ అయితే మాత్రం కీర్తి సురేష్ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా జెండా పాతేస్తుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement