
మహేష్, మురుగదాస్ సినిమా వాయిదా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను 2017 వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ను ప్లాన్ చేసిన యూనిట్ సభ్యులు అనుకున్నట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సినిమాను అనుకున్నట్టుగా ఏప్రిల్లో కాకుండా.. రెండు నెలలు ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఏప్రిల్లో బాహుబలి రిలీజ్ అవుతుండటంతో అదే సమయంలో తన సినిమా రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని భావించిన మహేష్ మురగదాస్లు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మే నెల మహేష్కు కలిసిరాదన్న ఉద్దేశంతో ఏకంగా రెండు నెలలు వాయిదా వేసి సినిమాను జూన్ 23న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.