మహేష్‌-మురుగ: వాయిదాకు కారణం ఇదే! | Mahesh-Murugadoss project updates | Sakshi
Sakshi News home page

మహేష్‌-మురుగ: వాయిదాకు కారణం ఇదే!

Published Mon, Oct 31 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

మహేష్‌-మురుగ: వాయిదాకు కారణం ఇదే!

మహేష్‌-మురుగ: వాయిదాకు కారణం ఇదే!

మహేష్‌బాబు-మురుగదాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌గానీ, అఫీషియల్‌ అప్‌డేట్‌గానీ ఏమీ వెలువడకున్నా మహేష్‌ అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి మహేష్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి అభిమానుల్ని ఖుషీ చేయాలని చిత్రయూనిట్‌ భావించింది. అందుకు ఏర్పాట్లు కూడా జరిగినట్టు కథనాలు వచ్చాయి. కానీ, దీపావళి రోజున అలాంటిదేమీ విడుదల కాలేదు.

సినిమా టైటిల్‌పై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం వల్లే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. మురుగదాస్‌ దర్శకత్వంలో ద్విభాష (తెలుగు-తమిళ)  చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పలు టైటిళ్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీ చిత్రయూనిట్‌ మాత్రం 'ఏజెంట్‌ శివ' టైటిల్‌కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఒక్కసారి సినిమా టైటిల్‌పై స్పష్టత వస్తే వెంటనే ఫస్ట్‌లుక్‌ విడుదల చేయవచ్చునని వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. పూర్తిగా సరికొత్త రీతిలో ఈ సినిమాలో మహేష్‌ పాత్రను మురుగదాస్‌ తీర్చిదిద్దాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్‌లుక్‌ విషయంలో త్వరలోనే మహేష్‌ అభిమానుల ఎదురుతెన్నులు ముగిసే అవకాశముందని ఆ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement