జనతా గ్యారేజ్లో మహేష్ | Mahesh babu New Movie Using Janatha Garage Set | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్లో మహేష్

Published Sun, Sep 4 2016 8:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

జనతా గ్యారేజ్లో మహేష్

జనతా గ్యారేజ్లో మహేష్

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ జనతా గ్యారేజ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనతో పాటు ఈ సినిమాలో మేజర్ సీన్స్లో కనిపించిన జనతా గ్యారేజ్ సెట్కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమా సెట్లో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీన్తో పాటు ఓ పాటను కూడా జనతా గ్యారేజ్ సెట్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే లుక్లో కాకుండా కొద్ది పాటి మార్పులతో ఈ సెట్ను మహేష్ సినిమా కోసం రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్న మహేష్ తిరిగొచ్చాక ముందుగా చెన్నై షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ తరువాతే జనతా గ్యారేజ్ సెట్లో మహేష్ షూటింగ్ మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement