అమెరికాలో ఆడియో రిలీజ్ | NTR Janata Garage Audio Launch At USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఆడియో రిలీజ్

Published Fri, May 13 2016 4:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

అమెరికాలో ఆడియో రిలీజ్

అమెరికాలో ఆడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. టెంపర్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన జూనియర్, తరువాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ వసూళ్ల టార్గెట్ను రీచ్ అయ్యాడు. అదే జోరులో ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా జనతా గ్యారేజ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.

సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకంగా మారిన ఓవర్ సీస్ మార్కెట్లో పట్టు కోసం, జనతా గ్యారేజ్ ఆడియోను అమెరికాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అయితే గతంలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు కూడా తమ సినిమా ఫంక్షన్లను అమెరికాలో ప్లాన్ చేసి వెనక్కి తగ్గారు. వన్ నేనొక్కిడినే, శ్రీమంతుడు సినిమాల సమయంలో ఇదే ప్లాన్ చేసిన మహేష్ వర్క్ అవుట్ కాదేమో అన్న ఆలోచనతో వెనకడుగు వేశాడు. మరి ఎన్టీఆర్ ప్లానింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement