
స్పీడు పెంచిన చెర్రీ
వరుసగా మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ కొద్ది రోజులుగా సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి
వరుసగా మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ కొద్ది రోజులుగా సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బ్రూస్ లీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ధృవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెర్రీ, ఆ సినిమా తరువాత కూడా మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 లోనటిస్తున్న చరణ్ ఇప్పుడు స్పీడు పెంచాడు.
రంగస్థలం 1985 సెట్స్ మీద ఉండగానే వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన సొంతం నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్ కంపెనీలో ఓ సినిమా చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు చెర్రీ. ఆ సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలోనూ చరణ్ సినిమా ఉంటుందన్న వార్త వినిపిస్తోంది. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్.