
రకుల్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!
టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్ తరువాత విజయ్ తో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికే విజయ్ హీరోగా తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మురుగదాస్, మరో బిగ్ హిట్ మీద కన్నేశాడు. అయితే ఈసినిమాకు ముందుగా సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో ఆ ఛాన్స్ రకుల్ చేతికి వెళ్లింది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.