నేను ఆయన పాదాలు తాకాను : అమితాబ్‌ | Amitabh Bachchan Respect To Shivaji Ganesan calls Himself Shivaji Disciple | Sakshi
Sakshi News home page

నేను ఆయన పాదాలు తాకాను : అమితాబ్‌

Published Thu, Apr 4 2019 2:19 PM | Last Updated on Thu, Apr 4 2019 2:22 PM

Amitabh Bachchan Respect To Shivaji Ganesan calls Himself Shivaji Disciple - Sakshi

‘మాస్టర్‌ శివాజీ గణేషన్‌ నీడలో ఇద్దరు శిష్యులు.. సూర్య మరియు నేను. తమిళ సినిమా లెజెండ్‌ శివాజీ ఫొటో గోడపై ఉంది. ఆయనను గౌరవిస్తూ నేను ఆ లెజెండ్‌ పాదాలు తాకాను’ అంటూ బిగ్‌ బీ అమితాబ్‌ షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్‌, నటుడు ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్న ‘ఉయర్నద మనిదన్‌’ సినిమాతో అమితాబ్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌వానన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ క్రమంలో ఎస్‌జే సూర్యతో కలిసి ఉన్న ఫొటోలను అమితాబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయనకు జంటగా సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటించనున్నట్టు సమాచారం. ఈ తమిళ సినిమాతో పాటు చిరంజీవి ‘సైరా’ మూవీలోనూ అమితాబ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాదిలోని ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement