భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్న విలన్‌! | SJ Suryah Shocking Remuneration | Sakshi
Sakshi News home page

SJ Suryah: రెమ్యునరేషన్‌ ఓ రేంజ్‌లో అడుగుతున్న విలన్‌, ఎంతంటే?

Published Mon, Feb 7 2022 1:01 PM | Last Updated on Mon, Feb 7 2022 1:30 PM

SJ Suryah Shocking Remuneration - Sakshi

విలన్లు అంటేనే భయపెట్టేవాళ్లు. సినిమాల్లో హీరోహీరోయిన్లను, మంచివాళ్లను భయపెడుతుంటారు. కానీ కొన్ని సినిమాల్లో నటించిన విలన్లు మాత్రం ప్రేక్షకులను సైతం గజగజలాడించారు. వాటిలో 'స్పైడర్‌' మూవీ ఒకటి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో విలన్‌ పాత్ర పోషించిన ఎస్‌జే సూర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

సూర్య నటుడు మాత్రమే కాదు దర్శకుడు, రచియత, నిర్మాత కూడా! తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నటుడికి ఇటీవలే టాలీవుడ్‌ నుంచి ఓ మంచి ఆఫర్‌ అతడి తలుపు తట్టిందట. కానీ సూర్య తనకు రూ.7 కోట్ల పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పడంతో నిర్మాతు ఖంగు తిన్నట్లు సమాచారం. ఇంతకీ సూర్యకు ఏ మూవీలో ఛాన్స్‌ వచ్చింది? అతడు ఆ ప్రాజెక్ట్‌కు ఓకే అయ్యాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement