పండగవేళ..పెను విషాదం | three persons died in road accident | Sakshi
Sakshi News home page

పండగవేళ..పెను విషాదం

Published Thu, Jan 16 2014 6:46 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

three persons died in road accident

సింహాచలం, న్యూస్‌లైన్: అడవివరం దగ్గర భైరవవాక వద్ద మంగళవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రి లో కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆనందపురం మండలంలోని ప్రసాదునిపాలెంకు చెందిన ప్రసాదుని అప్పలరాజు (33) కుమారుడు గణేష్ (12)తో కలసి పల్సర్ వాహనంపై సిం హాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వా మి దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు.

ఆనందపురం మండలానికే చెందిన ముచ్చర్ల గ్రామవాసి గం డ్రెడ్డి గౌరి (22)తన మేనల్లుడు యామవలస సూరి (15)తో కలిసి హీరో హోండా ప్యాషన్ వాహనంపై శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నాడు. సరిగ్గా భైరవవాక దగ్గరకు వచ్చేసరికి ఉదయం 9.30 గంటల సమయంలో వీరి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో వాహనాలు నడుపుతున్న అప్పలరాజు, గౌరి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

 తీవ్ర గాయాలపాలైన గణేష్, సూరిలను ఆటోలో హుటాహుటిన కేజీహెచ్ తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గోపాలపట్నం ట్రాఫిక్ ఏసీపీ అర్జున్, ఎస్‌ఐ వర్మ ్రపమాద స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి గణేష్ కూడా మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకు న్న అప్పలరాజు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

 అతి వేగమే ప్రమాదానికి కారణమని, దీనికి తోడు హెల్మెట్‌లు ధరించకపోవడంతోనే వీరు మృతి చెందారని ఏసీపీ అర్జున్ అభిప్రాయపడ్డారు. హెల్మెట్‌లు ధరించాలని, వేగంగా వెళ్లకూడదని తాము ఎంత ప్రచారం చేస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement