‘‘డిసెంబర్ 31’ సినిమా మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉంది. స్టోరీ లైన్ విన్నాను. సస్పెన్స్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్. ఏసీపీ రవీంద్ర పాత్ర పవర్‌ఫుల్‌గానే కాకుండా సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. జి. కొండలరావు, నవకాంత్, షకలక శంకర్, పోసాని కృష్ణమురళి, గౌతంరాజు, నరేష్, గిరీష్, హర్ష, శ్రావణి, మధురెడ్డి, అమీషా ముఖ్యతారలుగా జి. కొండలరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డిసెంబర్ 31’. ‘వర్మగారి బంగ్లా’ అనేది ట్యాగ్ లైన్. గణగళ్ల మానస సమర్పణలో శ్రీ గౌతం క్రియేషన్స్ పతాకంపై జి.లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని వీవీ వినాయక్ విడుదల చేశారు.
జి. కొండలరావు మాట్లాడుతూ– ‘‘ప్రతి డిసెంబర్ 31న ఎంతోమంది అమ్మాయిలు పార్టీ పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. హత్యలు చేయబడుతున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? వీటిని ఏ విధంగా ఆపవచ్చు? ఈ హత్యలు చేస్తోంది ఎవరు? వంటి వాటిని గుర్తించడం కోసం స్పెషల్ ఆఫీసర్, ఎన్‌కౌంటర్ స్పెషలిష్ట్ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగి హంతకులను ఎలా పట్టుకున్నారు... అన్నదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అంబటి రాఘవేంద్రరెడ్డి, రాయితి రమణమూర్తి, జి.అప్పారావు, సంగీతం:బోలె, కెమెరా: వెంకట్.
వర్మ బంగ్లాలో ఏం జరిగింది?
Published Sun, Feb 24 2019 12:50 AM | Last Updated on Sun, Feb 24 2019 12:50 AM
Comments
Please login to add a commentAdd a comment