సమాజంలో పెళ్లికాని ప్రసాదులూ ఉన్నారు.. ముచ్చటగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ మధ్యే మలయాళ నటుడు బాల (బాలకుమార్) సైతం నాలుగో వివాహం చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరిద్దరికీ దాదాపు 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయితే చాలామంది తనను చూసి కుళ్లుకుంటున్నారంటున్నాడు బాల.
రాజులా బతుకుతున్నా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు బాల మాట్లాడుతూ.. 'ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు, కోకిలకు 24 ఏళ్లు. అయినా మా సంసార జీవితం సంతోషంగా సాగుతోంది. నేను రాజులా బతుకుతున్నా.. భార్యను రాణిలా చూసుకుంటున్నా.. త్వరలోనే మాకు ఓ బుజ్జి బాబు/పాపాయి రానుంది. ఇదంతా చూసి మీరు అసూయ చెందితే దానికి నేనేం చేయలేను.
తప్పులు వెతకడమే మీ పని
మీ దగ్గర డబ్బు లేకనే ఏ అమ్మాయి దొరకడం లేదు. అయినా నా నాలుగు పెళ్లిళ్లపై ఏడుస్తారేమో! ప్రతిదాంట్లో తప్పులు వెతకడమే మీలాంటివారి పని' అని కౌంటరిచ్చాడు. కోకిల మాట్లాడుతూ.. చాలాకాలంగా మామ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇప్పుడు నేను అతడికి తోడుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి అతడు అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అది చూసే నేను ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చింది.
పెళ్లి హిస్టరీ..
ఇకపోతే బాల.. కంగువ మూవీ డైరెక్టర్ శివకు తమ్ముడవుతాడు. కాగా బాల 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. తర్వాత పొరపచ్చాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను పెళ్లాడగా ఆమెతోనూ సుదీర్ఘ ప్రయాణం చేయలేదు. పోయిన ఏడాదే విడిపోయాడు. ఈ మధ్యే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment