బాలా దర్శకత్వంలో? | Director Bala's Next Movie | Sakshi
Sakshi News home page

బాలా దర్శకత్వంలో?

Published Fri, Dec 27 2013 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

Director Bala's Next Movie

తమన్నా అందగత్తె మాత్రమే కాదు. మంచి నటి కూడా. అయితే, నటిగా నిరూపించుకోదగ్గ గొప్ప సినిమాలేవీ... ఈ పాలరాతి బొమ్మను వరించకపోవడం బాధాకరం. ఎట్టకేలకు నటిగా సత్తా చాటడానికి తమన్నాకు ఓ గొప్ప అవకాశం చిక్కింది. బాలా దర్శకత్వంలో ఈ మిల్కీ బ్యూటీ నటించనుందని తెలిసింది. గ్లామర్ హీరోయిన్లను సైతం డీగ్లామరైజ్డ్‌గా చూపించడం బాలా స్టైల్. అందంతో ప్రమేయం లేకుండా కేవలం అభినయానికే పెద్ద పీట వేయడం బాలా మార్క్. 
 
మరి ఇప్పటివరకూ అందాలతారగా వెలిగిన తమన్నాను బాలా ఎలా చూపిస్తారో, ఆమె నుంచి ఏ స్థాయి నటనను రాబడతారో ప్రత్యేకించి చెప్పాలా! విశాల్ ఇందులో కథానాయకునిగా నటిస్తాడని సమాచారం. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో కూడా బాలా దర్శకత్వంలో నటించనున్నట్లు విశాల్ చెప్పారు. సేతు, శివపుత్రుడు, నేను దేవుణ్ణి, వాడు-వీడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన దర్శకునిగా మారిన బాలాతో పనిచేసే అవకాశం తమన్నాకు రావడమే నిజమైతే... తను నిజంగా లక్కీనే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement