బిజీ బిజీగా బల్లాలదేవ | Baahubali ballaladeva rana busy with three more films | Sakshi
Sakshi News home page

బిజీ బిజీగా బల్లాలదేవ

Published Wed, Feb 10 2016 8:45 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బిజీ బిజీగా బల్లాలదేవ - Sakshi

బిజీ బిజీగా బల్లాలదేవ

సౌత్ నార్త్ అన్నతేడా లేకుండా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు యంగ్ హీరో రానా. ఇప్పటికే రానా ప్రధాన పాత్రలో నటించిన బెంగళూర్ నాట్కల్ తమిళనాట మంచి విజయం సాధించగా, ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న సబ్ మెరైన్ వార్ ఫిలిం ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి భారీ చిత్రం బాహుబలి 2లోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు.ఇలా మూడు సినిమాలతో సందడి చేస్తున్న రానా చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.

జాతీయ అవార్డులు సాధించిన క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా రానాతో సినిమా తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా హీరో, విలన్ అన్న తేడా లేకుండా ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పటం రానాకు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు బాల, రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. మరో జాతీయ అవార్డ్ దర్శకుడు పరుత్తి వీరన్ ఫేం అమీర్ కూడా రానా హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు బల్లాలదేవ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement