Bengalore naatkal
-
బిజీ బిజీగా బల్లాలదేవ
సౌత్ నార్త్ అన్నతేడా లేకుండా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు యంగ్ హీరో రానా. ఇప్పటికే రానా ప్రధాన పాత్రలో నటించిన బెంగళూర్ నాట్కల్ తమిళనాట మంచి విజయం సాధించగా, ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న సబ్ మెరైన్ వార్ ఫిలిం ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి భారీ చిత్రం బాహుబలి 2లోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు.ఇలా మూడు సినిమాలతో సందడి చేస్తున్న రానా చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. జాతీయ అవార్డులు సాధించిన క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా రానాతో సినిమా తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా హీరో, విలన్ అన్న తేడా లేకుండా ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పటం రానాకు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు బాల, రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. మరో జాతీయ అవార్డ్ దర్శకుడు పరుత్తి వీరన్ ఫేం అమీర్ కూడా రానా హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు బల్లాలదేవ. -
రానా చాలా ఇబ్బంది పెట్టాడు : శ్రీ దివ్య
ప్రస్తుతం బెంగళూరు నాట్కల్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రీదివ్య, సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సమంత, ఆర్య, బాబీ సింహా, లక్ష్మీరాయ్‌లు నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. తమిళనాట ఈ శుక్రవారం రిలీజ్ అయిన బెంగళూర్ నాట్కల్ డిసెంట్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీదివ్య, షూటింగ్ సమయంలో రానా తనను తెగ ఇబ్బంది పెట్టాడని చెప్పింది. అయితే రానా, శ్రీదివ్యను ఇబ్బంది పెట్టింది వ్యక్తిగతంగా కాదులేండి. రానా, శ్రీదివ్యలు ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి హైట్ మ్యాచ్ కాకపోవటంతో షూటింగ్ సమయంలో నానా తంటాలు పడాల్సి వచ్చిందట. కార్ సీట్ నుంచి ప్రతీ విషయంలో శ్రీదివ్యను హైట్‌గా చూపించటం కోసం తెగ కష్టపడాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని సరదాగా మీడియాతో షేర్ చేసుకుంది శ్రీదివ్య.