బాల దర్శకత్వంలో ఎన్టీఆర్..? | Bala Planning movie With NTR | Sakshi
Sakshi News home page

బాల దర్శకత్వంలో ఎన్టీఆర్..?

Published Tue, Aug 2 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

బాల దర్శకత్వంలో ఎన్టీఆర్..?

బాల దర్శకత్వంలో ఎన్టీఆర్..?

మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి హీరో.. అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తెరకెక్కించే ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడితో సినిమా చేసే ఎలా ఉంటుంది.? అలాంటి అరుదైన కాంబినేషన్ త్వరలోనే వెండితెర మీద సందడిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివపుత్రుడు, నేను దేవుణ్ని, వాడు వీడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన బాల, తెలుగులో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ చూసి షాక్ అయిన మోహన్ లాల్ బుడ్డోడి టాలెంట్ గురించి బాలతో చెప్పాడట. అయితే తాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్న ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ త్వరలోనే ఎన్టీఆర్ కు కథ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు.

మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బాల చేసే ప్రయోగాలకు అంగీకరిస్తాడా..? టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న జూనియర్ ఒక్కసారిగా రూట్ మార్చి ప్రయోగం చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో..? మరి ఇలాంటి రిస్క్ ఈ సమయంలో ఎన్టీఆర్ చేస్తాడో.. లేదో..? చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement