జనతా గ్యారేజ్ రెండు సార్లు చూసిన జక్కన్న | Rajamouli about janatha garage | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్ రెండు సార్లు చూసిన జక్కన్న

Published Thu, Sep 1 2016 1:11 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

జనతా గ్యారేజ్ రెండు సార్లు చూసిన జక్కన్న - Sakshi

జనతా గ్యారేజ్ రెండు సార్లు చూసిన జక్కన్న

ఎంత బిజీగా ఉన్న తనకు నచ్చిన సినిమాలను, తనకు కావలసిన వాళ్ల సినిమాలను తొలి రోజే చూసేయటం దర్శకధీరుడు రాజమౌళికి అలవాటు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాను తొలిరోజే వరుసగా రెండు షోలు చూశాడు జక్కన్న. చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

'జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ల కాంబినేషన్, వారి నటన నాకెంతగానో నచ్చింది. వారిద్దరూ అద్భుతంగా నటించారు. టెంపర్ సినిమా తరువాత తారక్ ఎంచుకుంటున్న పాత్రలు, తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న తీరు చూస్తే నాకు గర్వంగా ఉంది. నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా నా మిత్రుడు రాజీవ్ కనకాల నటన మనసును తాకేలా ఉంది. వరుసగా రెండు సార్లు ఈ సినిమాను చూశాను' అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement