
విక్రమ్ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రం ‘పితామగన్’. తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువదించారు. విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హిట్ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ‘పితామగన్’ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. కానీ సతీష్ యాక్టర్‌గా బిజీగా ఉండటంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ బాలా–విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సేతు’ సినిమాను ‘తేరే నామ్’ టైటిల్‌తో రీమేక్ చేశారు సతీష్. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. మరి.. ‘పితామగన్’ రీమేక్‌కి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారో, విక్రమ్–సూర్య పాత్రలకు ఏ హీరోలను ఎంపిక చేస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment